న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ రెండవ రోజు తెలుపు రంగు సూట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెనుక తన భర్త జరెద్ కుష్నర్‌తో కలిసి ఇవాంక రాష్ట్రపతి భవన్ వద్దకు వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెలుపు రంగు సూట్ ధరించారు. ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే ఈ షేర్వానీని డిజైన్ చేశారు. పశ్చిమబెంగాల్‌కి చెందిన ముర్షిదాబాద్ పట్టుతో షేర్వానీని అందంగా డిజైన్ చేశారు. దీనికి మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. స్లీవ్‌లెస్ కాకుండా తెలుగు రంగు సూట్‌తో పాటు స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. అందులో నిండుగా భారతీయత ఉట్టిపడేట్టు ఇవాంక కనిపించారు.